పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఓజి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే హౌస్ఫుల్ షోలు వేసి మంచి హంగామా సృష్టించిన ఈ సినిమా, అధికారిక రిలీజ్ తో మరింత ఊపందుకుంది. దీంతో ఫ్యాన్స్ కి ఇది నిజంగా పెద్ద పండుగలా మారింది.
ఓజి విడుదలకు ముందే దీనికి సీక్వెల్ ఉంటుందని కొంత టాక్ వినిపించింది. కానీ ఆ వార్తలు తర్వాత పెద్దగా కొనసాగలేదు. అయితే ఇప్పుడు థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన వెంటనే రెండో భాగం ఉన్నట్టుగా స్పష్టంగా ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ నుంచి మరోసారి ఓజి కొనసాగింపుతో ఎంటర్టైన్మెంట్ రాబోతుందన్న మాట.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా, భారీ స్థాయిలో డీవివి దానయ్య ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు.