పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి” తాజాగా థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్ ముందు నుంచే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ బాక్సాఫీస్ వద్ద స్పష్టంగా కనిపించింది. మొదటి రోజు నుంచే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ పవన్ అభిమానులను ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్లింది.
ఈ విజయాన్ని ఆనందిస్తున్న సమయంలో మేకర్స్ సెట్‌లో క్లిక్ చేసిన ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో డైరెక్టర్ సుజీత్ ముందున నిలబడి సీన్ వివరించగా, వెనక పవన్ కళ్యాణ్ బ్లర్‌గా కనిపించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఆ ఒక్క ఇమేజ్ చూసినా పవన్ పవర్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో అనిపించేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మించింది.