పవన్‌ కల్యాణ్‌ మాస్‌ వార్నింగ్‌!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై అభిమానుల ఆశలు, అంచనాలు భారీగా ఉండటంతో విడుదలకు ముందు నుంచే మంచి హైప్ ఏర్పడింది. ఇక థియేటర్లలో సినిమా చూసినవాళ్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ చూసుకుంటే.. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కిందని స్పష్టమవుతోంది.

దర్శకులు క్రిష్ , జ్యోతి కృష్ణ ఈ సినిమాను చారిత్రక నేపథ్యంలో రూపొందించారు. కథనం, విజువల్స్, ఫైట్లు అన్నీ కలిసి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. అక్కడ పవన్ మాట్లాడిన మాటలు అభిమానుల గుండెల్ని తాకాయి.

తన సినిమా ప్రేక్షకుల్లోకి చేరడం, వాళ్ల హృదయాల్లో నిలిచిపోవడం అనేదే తనకు నిజమైన విజయం అని పవన్ భావించారు. సినిమా బాగుపడితే ఇది ఒక్క వ్యక్తి కృషి వల్ల కాదు.. మొత్తం టీమ్ పెట్టిన శ్రమ వల్లే సాధ్యమైందన్నారు. చరిత్రను కొంతమంది తప్పుగా వర్ణించడం వల్లే మొఘల్ పాలకులకు అనవసరమైన గొప్పతనాన్ని కలిపారని, కానీ వాళ్లు చేసిన దారుణాలు మాత్రం చాలామంది చరిత్రకారులు చెప్పలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక సోషల్ మీడియాలో తన సినిమాపై నెగిటివ్ ట్రోల్స్ చేస్తామని, బహిష్కరిస్తామని కొందరు పెట్టే పోస్టుల గురించి కూడా పవన్ స్పందించారు. ఇలాంటి బెదిరింపులు చాలానే చూసానని, వాటికి భయపడి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. ఎవరికోసం మార్చుకునే తాను కాదని, నిజంగా నచ్చినదే చెబుతానని తనదైన స్టైల్‌లో క్లారిటీ ఇచ్చారు.

మొత్తానికి, హరిహర వీరమల్లు సినిమా కేవలం స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా.. చరిత్రను, నిజాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ మరోసారి తన దృష్టికోణాన్ని స్పష్టంగా చెప్పాడు. అభిమానులు అయితే ఈ సినిమాను పండుగలా భావిస్తూ థియేటర్లలో జోష్ చూపిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories