మిలియన్ డాలర్ స్నాప్‌ – బ్రహ్మి-పవన్‌ హ్యాపీ మూమెంట్‌!

పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియడ్ మాస్ ఎంటర్టైనర్ “హరిహర వీరమల్లు” ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా జూలై 24న థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కానీ అసలైన ట్రీట్ మాత్రం రేపు రాత్రి నుంచే మొదలవుతుంది, అర్ధరాత్రి షోస్ తో అభిమానుల వేడుక స్టార్ట్ కానుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న భారీగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హాస్య నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. ఆయన స్పీచ్, పవన్ కళ్యాణ్ పై చూపించిన అభిమానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ వేడుకలో బ్రహ్మానందం, పవన్ కలిసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వింటేజ్ గెటప్ లో పవన్ కళ్యాణ్, పక్కనే బ్రహ్మానందం సంతోషంగా నవ్వుతున్న అండ్ ఛాట్ చేస్తున్న దృశ్యం చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఈ ఫోటోను నెటిజన్లు “అసలైన ఫ్యాన్ మూమెంట్”, “మిలియన్ డాలర్ స్నాప్” అంటూ తెగ షేర్ చేస్తున్నారు.

ఇక జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విశేషాలు, విజువల్స్ ఇప్పటికే టీజర్లతో ఆసక్తిని పెంచాయి. పవన్ కళ్యాణ్ తన యాక్షన్, డైలాగ్ డెలివరీతో స్క్రీన్ మీద ఎలా దుమ్ము రేపుతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories