అహంకార సూచికల తేడా చెప్పిన పవన్!

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏ స్థాయి అహంకారంతో వైసీపీ నాయకులంతా చెలరేగిపోయారో అందరికీ తెలుసు. కేవలం అవినీతి, అరాచకాలు మాత్రమే కాదు.. అహంకార ప్రదర్శన కూడా వారి అలవాటు- అన్నట్టుగా అయిదేళ్లు గడచిపోయాయి. ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసాన్ని పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా చెబుతున్నారు. జగన్ తీరుతెన్నులకు, తమ పరిపాలనకు ఉన్న తేడా ఏంటో ఆయన విశదీకరిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన పవన్ కల్యాణ్.. జగన్ తీరును ‘లోలెవెల్’ అంటూ ఎండగట్టడం గమనార్హం.

భారీ సినిమాల నిర్మాణం జరిగినప్పుడు.. బడ్జెట్ వందల కోట్లకు వెళ్లిపోవడం అనేది ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణ విషయంగా మారింది. తెలుగు సినిమా స్థాయిపెంచే సినిమాలు తయారవుతున్న మాట వాస్తవం. అంతర్జాతీయంగా సినీ ప్రేక్షకులను అలరించే, ఆకర్షించే సినిమాలు తయారవుతున్నాయి. వాటి బడ్జెట్ మరియు స్థాయిని విడుదల అయినప్పుడు కొన్ని రోజుల పాటు టికెట్ ధర పెంచుకోవడానికి కూడా ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. ఆ మేరకు భారీచిత్రాలకు ఊరట దక్కుతోంది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగానే రెస్పాండ్ అవుతున్నాయి.
అయితే జగన్ ప్రభుత్వ కాలంలో సినిమా టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇవ్వాలంటే.. జగన్ ఎంత అహంకార పూరితంగా వ్యవహరించేవారో.. పవన్ కల్యాణ్ ఇవాళ బయటపెట్లారు. సినిమా ధరల పెంపుకోసం హీరోలు ముఖ్యమంత్రి వద్దకు రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సినిమా నిర్మాత, ట్రేడ్ కు సంబంధించిన వారు వస్తే సరిపోతుంది కదా.. హీరోలను కూడా మావద్దకు పిలిపించుకుని వారితో నమస్కారాలు పెట్టించుకోవాలనే కోరిక మాకు లేదు.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మేం అంతటి లోలెవెల్ వ్యక్తులం కాదు అని కూడా అన్నారు.

జగన్  పాలన కాలంలో.. సినిమా ఇండస్ట్రీ వారికి రేటు పెంచుకునే అనుమతులు ఇచ్చారు గానీ.. ఆయా సందర్భాల్లో సినిమా ప్రముఖులందరూ తమ వద్ద సాగిల పడే పరిస్థితిని కల్పించారనే విమర్శలు అప్పట్లోనూ వచ్చాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ జగన్ లోని అహంకారపు పోకడలను ఈ మాటలతో మరోసారి గుర్తుచేసినట్లు అయింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories