పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చివరి దశకు చేరడంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే సినిమా విడుదలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ ప్రమోషన్ ప్లాన్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. సాధారణంగా ప్రమోషన్స్ వేదికలపై పవన్ కనిపించడమే అరుదు. అలాంటి ఆయన ఈసారి ప్రత్యేకంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముందుకొస్తుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రం పవన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కానీ హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఆయన నార్త్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ విధంగా ఈసారి హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందే పవన్ తన స్థాయిలో ప్రమోషన్స్‌కి సెట్ అయ్యారు. అభిమానుల కోరిక నిజమవుతుండటంతో వారిలో ఉత్సాహం మరింత పెరిగింది.