పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా వస్తున్న తాజా చిత్రం ఓజి ప్రస్తుతం భారీ హంగామా క్రియేట్ చేస్తోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే హైప్ ఏ స్థాయిలో ఉందో యూఎస్ బాక్సాఫీస్ దగ్గరే తెలుస్తోంది.
అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బుకింగ్స్ మొదలైన వెంటనే హౌస్ఫుల్ షోస్ తో దూసుకుపోతోంది. ప్రీ సేల్స్ లో ఇప్పటికే రెండు లక్షల డాలర్ల మార్క్ దాటేసింది. ఇది పవన్ కళ్యాణ్ కి సరైన ప్రాజెక్ట్ దొరకగానే ఎంత స్థాయి రెస్పాన్స్ వస్తుందో స్పష్టంగా చూపిస్తోంది.