తమిళ నటుడు విజయ్ ఆంటోని నటిస్తున్న ల్యాండ్ మార్క్ 25వ చిత్రాన్ని ఇప్పటికే శరవేగంగా పూర్తి చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను గతంలో రిలీజ్ చేశాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘పరాశక్తి’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.
కానీ, అదే టైటిల్‌తో శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ వస్తుండటంతో, ఇప్పుడు విజయ్ ఆంటోని తన సినిమాకు ‘భద్రకాళి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మార్చి 12న సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.