భారత్ నిర్వహించిన దాడులలో ఐదు యుద్ధ విమానాలు పాల్గొన్నాయని.. వాటిలో మూడింటిని పాక్ సైనిక బలగాలు భారత భూభాగంలోనే కూల్చివేశాయని.. పాకిస్తాన్ బుధవారం ఉదయం ప్రకటించింది. సాయంత్రానికి ఈ ప్రకటనలో ఇంకొక మార్పు వచ్చింది. భారత్ కు చెందిన మొత్తం ఐదు యుద్ధవిమానాలను కూడా భారత భూభాగంలో ఉండగానే కూల్చివేశాం అని పాక్ ప్రకటించింది. భారత యుద్ధ విమానాలను ఒక్కదానిని కూడా తమ భూభాగంలోకి రానివ్వనేలేదని చాలా డాంబికంగా ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే వాస్తవం ఏమిటంటే.. భారత్ కు చెందిన ఒక్క యుద్ధ విమానాన్ని కూడా పాకిస్తాన్ కూల్చివేయడం జరగనే లేదు. అసలు బుధవారం తెల్లవారుజామున భారత్ చేసిన దాడులకు సంబంధించి ఒక్క విమానం కూడా సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి వెళ్ళవలసిన అవసరమే ఏర్పడలేదు. భారత సైనిక అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు ఈ దాడులలో మనకు ఒక్క నష్టం కూడా వాటిలో లేదని స్పష్టంగా చెప్పారు. కానీ పాకిస్తాన్ పరువు కాపాడుకోవడానికి భారత విమానాలను ధ్వంసం చేసినట్లుగా అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ బుధవారం తెల్లవారుజామున దాడులలో అత్యంత ఆదనాతనమైన క్రూజ్ మిసైళ్ళు, హామర్ స్మార్ట్ బాంబులు ఉపయోగించింది. ఇవి సాధారణమైన వాటికంటే ఎక్కువ రేంజిని కలిగి ఉండేవి. వీటిని యుద్ధ విమానం భారత్ భూభాగంలోనే ఉండగా అక్కడి నుంచే టార్గెట్ ప్రదేశాలపై ప్రయోగించడానికి వీలుంటుంది. అవి అంత దూరం ప్రయాణించి కచ్చితంగా కోఆర్డినేట్స్ లో పేర్కొన్న భవనాన్ని మాత్రమే పేల్చుతాయి. అంతేతప్ప పక్కనుండే భవనాలకు కూడా ప్రమాదం కలిగించవు.
అంత ఖచ్చితత్వంతో భారత దాడులను నిర్వహించింది.
అయితే తన దేశంలో ఎనిమిది మంది పౌరులు చనిపోయినట్లుగా తొలుత కొన్ని అబద్ధాలను వండి వార్చిన పాకిస్తాన్.. అదే క్రమంలో మూడు భారత యుద్ధ విమానాలను భారత భూభాగంలో ఉండగానే కూల్చి వేసినట్లుగా చెప్పుకుంది. అంటే సాయంత్రానికి వారికి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అలా చెప్పడం వలన పాకిస్తాన్ భూభాగంలో పేల్చివేసినట్టుగా చెప్పుకుంటున్న భారత యుద్ధ విమానాల శకలాలను ఫోటోల రూపంలో చూపించాల్సి వస్తుంది కదా.. అనేది అర్థమైంది. అప్పుడే ఒక మాట మార్చి మొత్తం ఐదు భారత యుద్ధ విమానాలను తమ భూభాగంలోకి ప్రవేశించనివ్వకుండానే కూల్చివేసినట్లుగా కొత్త పాట ఎత్తుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దాడుల దెబ్బకు పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టినట్లుగా అర్థమవుతోంది.