తాజాగా ఇండియన్ ఓటిటిలో వచ్చి మంచి హిట్ అయ్యిన వెబ్ సిరీస్ లలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సిరీస్ పాతాళ లోక్ సీజన్ 2 ఒకటి. అయితే ఈ రెండు సీజన్లలో కూడా తన సిన్సియర్ నటనతో హాతీరాం చౌదరి అనే పాత్రలో నటుడు జైదీప్ అహలావత్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
తన నటనకి మంచి మార్కులు రాగా ఇపుడు సినీ వర్గాల్లో తన రెమ్యునరేషన్ గురించి చర్చగా మారింది. మొదటి సీజన్ కి తాను కేవలం 40 లక్షలు రెమ్యునరేషన్ ని తీసుకోగా ఇటీవల వచ్చిన రెండో సీజన్ కి ఊహించని రేంజ్ లో ఏకంగా 20 కోట్లు అందుకున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
దీంతో తన గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ మొత్తం బాలీవుడ్ స్టార్ హీరోలు షాహిద్ కపూర్ అలాగే వరుణ్ ధావన్ లాంటి వారి దగ్గరకి ఉందట. ఇది ఒక నటుడికి రియల్ సక్సెస్ అంటూ నెటిజన్ పాతాళ లోక్ నటుడి విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.