సమాజం రూపురేఖలను మార్చేయనున్న పీ4!

దార్శనిక నాయకుడు అయినటువంటి చంద్రబాబునాయుడు పీ 4 కార్యక్రమాన్ని ఒక విధానంగా పరిపాలనలోకి తీసుకువస్తానని ప్రకటించినప్పుడు.. అందులో ఉన్న గొప్పతనం కొందరికి అర్థం కాలేదు. సమాజంలో సంపన్నులుగా ఎదిగిన వారు, తిరిగి సమాజానికి కొంత మేలు చేయాలని, అందుకు ముందుకు రావాలని.. కొందరు పేదల జీవితాలను బాగు చేయాలని.. ఈ పీ4 కార్యక్రమ స్ఫూర్తిగా చంద్రబాబునాయుడు ప్రకటించినప్పుడు.. కొందరు దానిని ఎద్దేవా చేశారు. కొందరు చంద్రబాబు మీద నమ్మకంతో ఖచ్చితంగా ఇది సత్పలితాలను సాధిస్తుందనే నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు, ఉగాది పర్వదినం నాడు పీ4ను ప్రకటించిన తరువాత.. సంపన్నుల నుంచి వస్తున్న స్పందన గమనిస్తోంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. పీ4 అనేది వ్యక్తిగతంగా లబ్ధిదారులుగా ఎంపిక చేసిన పేదల కుటుంబాలను ప్రగతి పథంలో నడిపించడం మాత్రమే కాదు. పూర్తిగా సామాజిక ముఖచిత్రాన్నే మార్చేయనున్నదనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. గుంటూరు జిల్లా కొమ్మమూరు కాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడానికి పది కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ ముందుకు రావడం ఒక పెద్ద ముందడుగుగా పలువురు భావిస్తున్నారు.

పీ4- అంటే, పబ్లిక్ ప్రెవేట్ పీపుల్ పార్టనర్‌షిప్  అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంపన్నులుగా ఎదిగిన ప్రెవేటు వ్యక్తులు, సంస్థలు తమ దాతృత్వంతో పేదలైన ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు ముందుకు రావడం.. ఇందుకు ప్రభుత్వం సంధానకర్తగా ఉండడం దీని లక్ష్యం. కొందరు పేదల జీవితాలను కొందరు సంపన్నులు దత్తత తీసుకోవాలనేది ఈ పథకం స్వభావం. ఇందుకోసం ఎంపికయ్యే లబ్ధిదారులను కూడా ‘మార్గదర్శి- బంగారు కుటుంబం’గా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ పథకం వల్ల పేదల కుటుంబాలు మాత్రమే  యూనిట్ గా మార్పులు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కారుమంచి ప్రసాద్ వితరణశీలతను గమనిస్తే.. కొన్ని గ్రామాలే ఊహించని విధంగా బాగుపడబోతున్నాయని అర్థమవుతోంది.
గుంటూరుజిల్లా కాకుమానుకు చెందిన కారుమంచి ప్రసాద్ 1995 నుంచి కూడా తన స్వగ్రామంలో  అభివృద్ధి పనులకు చేయూత అందిస్తున్నారు. పెదనందిపాడు లిఫ్ట్ ను పూర్తిచేయడానికి అప్పట్లో విరాళం ఇచ్చారు. కాకుమాను వద్ద కొమ్మమూరు కాల్వపై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేస్తే.. కాకుమాను, బీకేపాలెం, అప్పాపురం, గరికపాడు, కొండపాతూరు గ్రామాల్లోని 5,315 ఎకరాల భూమికి పుష్కలంగా  సాగునీరు అందుతుంది. దీంతో ఈ లిఫ్ట్ కోసం ఆయన పది కోట్ల రూపాయలను పీ4 కింద ప్రకటించారు.

వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ లిఫ్ట్ ఏర్పాటుకు యుద్ధప్రాతిదికన డీపీఆర్ సిద్ధం చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉదాహరణను గమనిస్తే.. వ్యక్తుల జీవితాలు మాత్రమే కాదు.. గ్రామాలకు గ్రామాలే పీ4 కారణంగా బాగుపడబోతున్నాయని అర్థమవుతోంది. ఇది యావత్ సమాజంలోనే గుణాత్మక మార్పుకు శ్రీకారం దిద్దుతుందని అర్థమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories