పరిమళించే మానవత్వపు రూపమే పీ4!

పేదల జీవితాలను మెరుగు పరిచే దిశగా చంద్రబాబు నాయుడు సత్సంకల్పానికి ప్రతీకగా రూపొందిన పీ4 పథకం రాష్ట్రంలో ఘనంగా ప్రారంభం అయింది. పేదలకోసం సంక్షేమ పథకాలను ప్లాన్ చేసే విషయంలో.. ఈ పథకం దేశంలోనే ఒక మైలురాయి కానుందని పలువురు పేర్కొంటున్నారు. దేశంలో తతిమ్మా అన్ని రాష్ట్రాల వారికి కూడా ఇది ఆదర్శం, అనుసరణీయం అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పీ4 ద్వారా దేశంలో మరెక్కడా లేని ఒక పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి సమాజంలో వ్యక్తుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడే పరిస్థితికి బీజం వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.,

పేదరికం నిర్మూలన కోసం ప్రారంభించిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు, మార్గదర్శులుగా మారి, బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఎవరినీ బలవంతం చేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పీ4 అనే ఒక అద్భుతమైన పథకాన్ని ఆయన తన ఆలోచనగా బయటపెట్టినప్పటినుంచి.. ఈ పథకం ద్వారా నిరుపేదల జీవితాల్లో రాగల గుణాత్మక మార్పు గురించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమితంగా భయపడుతున్న మాట వాస్తవం. చంద్రబాబునాయుడు సంకల్పిస్తున్నట్టుగా రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలలో ఈ పథకం ద్వారా.. ఏ చిన్న మార్పు వచ్చినా సరే.. అది తమ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు శాశ్వతమైన సమాధి కట్టేస్తుందని వారికి అర్థమైంది. అందుకే పీ4 పథకం సక్సెస్ కాకుండా ఉండేందుకు వారు అనేక వక్ర నీతులు అనుసరిస్తూ వచ్చారు. పీ4 మార్గదర్శులుగా ముందుకు వచ్చే దాతల కోసం పారిశ్రామికవేత్తలను, సంపన్నులను, చివరకు టీచర్లను కూడా బలవంతం చేస్తున్నట్టుగా తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. అంతే కాదు ఏ రకంగా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న విదేశీ పారిశ్రామికవేత్తలకు, పెట్టబడిదార్లకు వందల మెయిల్స్ పెట్టి బెదిరిస్తున్నారో.. అలాగే మార్గదర్శులుగా దాతృత్వంతో ముందుకు వస్త

రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,40,697 బంగారు కుటుంబాలను ఎంపిక చేసినట్టుగా, 1,41,977 మంది మార్గదర్శులుగా నమోదు అయినట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇది కేవలం మనసున్న వారికోసం ఏర్పాటుచేసిన పథకం అని సీఎం అంటున్నారు. పథకం అమలుపై ప్రతిరోజూ సమీక్షిస్తామని, మూడునెలల కోసారి మదింపు చేసి అవసరమైన మార్పుచేర్పులు చేస్తామని సీఎం అంటున్నారు. మొత్తానికి ప్రజల్లోనే ఉండే మానవత్వపు పరిమళానికి ప్రతీక ఈ పీ4 అని నిరూపణ అవుతోంది. శక్తి ఉండే ప్రతి ఒక్కరూ కూడా అవసరాలనున్న కుటుంబాలకు అండగా నిలవాలని చంద్రబాబునాయుడు పిలుపు ఇస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories