పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఓజి. ఈ మూవీపై ఎప్పటినుంచో అభిమానుల్లో ఎనలేని క్రేజ్ నెలకొంది. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ఆ క్రేజ్‌ని మరింత పెంచేసింది. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే వినిపించినా, అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.
ఈ ట్రాక్‌పై తాజాగా థమన్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు. గ్లింప్స్‌లో వినిపించిన ఈ మ్యూజిక్ పూర్తి సాంగ్‌గా వస్తుందని, దాని వ్యవధి 4 నిమిషాలు 14 సెకండ్లు ఉంటుందని వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఆ పూర్తి ట్రాక్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.