సింగిల్‌ గా రంగంలోకి దిగుతున్న ఓజీ!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ నెలలో రెండు భారీ సినిమాలు ఢీ కొట్టబోతున్నాయన్న హైప్ కలిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న “ఓజి”, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “అఖండ 2 – తాండవం” రెండూ ఒకే రోజు అంటే సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రావాలని ముందుగా అనౌన్స్ చేశారు. దీంతో ఆ రోజున బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రేంజ్‌లో పోటీ జరుగుతుందా అని సినీప్రియులు, ట్రేడ్ వర్గాలంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ తాజాగా ఆ పోటీ నుంచి బాలయ్య సినిమా వెనక్కి తగ్గింది. “అఖండ 2”ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోమని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ తేదీకి పవన్ కళ్యాణ్ “ఓజి” ఒక్కదాని బరిలోకి దిగనుంది. ఈ నిర్ణయంతో ఓజి సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం, సాలిడ్ ఓపెనింగ్స్‌తో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని మేకర్స్ నమ్ముతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories