పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమా కోసం ప్రేక్షకుల్లో ఉన్న హైప్ రోజు రోజుకి మరింత పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రత్యేకంగా నిలిచింది. తాజాగా విడుదలైన గన్స్ ఎన్ రోజేస్ సాంగ్ కూడా పెద్ద హిట్ అవుతూ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతోంది.
ఆల్బమ్‌లో విడుదలైన పాటలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విజయాన్ని సాధించడంతో, ఈ సినిమా మ్యూజిక్‌కి 100 శాతం హిట్ రికార్డ్ దక్కిందని చెప్పవచ్చు. మేకర్స్ కూడా అదే విషయాన్ని గర్వంగా చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు వచ్చిన ప్రతీ సాంగ్ కి ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ మాటలో నిజం ఉందని స్పష్టంగా తెలుస్తుంది.