ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే అలానే మమిత బైజు కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “జన నాయగన్”. విజయ్ కెరీర్లో చివరి సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. అయితే ఇంకో పక్క విజయ్ పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉండడంతో దర్శకుడు హెచ్ వినోద్ అండ్ టీం ఈ సినిమాని మరింత త్వరగా కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నారు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి హక్కులపై సాలిడ్ న్యూస్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రైమ్ వీడియో వారు ఏకంగా 121 కోట్లు ఇచ్చి జన నాయగన్ పాన్ ఇండియా ఓటిటి హక్కులు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇది విజయ్ కెరీర్లో లియో సినిమా తర్వాత అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.