విచారణలో మనుషులే మారేది.. స్క్రిప్టు ఒక్కటే!

అన్నీ ఒకే రకం నేరాలు అయినప్పుడు ఒకే రకం శిక్షలే కదా పడతాయి అని చాలా మంది అనుకోవచ్చు. అది నిజమే. అన్నీ ఒకే రకం నేరాలు అయినప్పటికీ.. విచారణకు హాజరయ్యే అందరు నిందితులకూ ఒకే రకమైన జవాబు ఎలా ఉండగలుగుతుంది? అలాంటి మాయ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే సాధ్యమవుతుంది. సోషల్ మీడియా సైకో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్లో వైసీపీ మహామహుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు విచారణలో ఒకటే మాట చెబుతున్నారు. ‘తెలియదు గుర్తులేదు మర్చిపోయా’ అని మాత్రమే!

తాజాగా వైఎష్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి వంతు వచ్చింది.
ఒకసారి 41ఏ నోటీసులు ఇస్తే అప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి పోలీసుల కళ్లు గప్పిన రాఘవరెడ్డి.. హైకోర్టు ముందస్తు బెయిలు పిటిషను విచారణలో భాగంగా అరెస్టునుంచి రక్షణ ఇచ్చాక మళ్లీ పులివెందులలో అడుగుపెట్టారు. రెండోసారి 41ఏ నోటీసులు అందుకుని విచారణకు హాజరయ్యారు. వైసీపీ దళాలు పెట్టిన సైకో పోస్టులు, ప్రధానంగా వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ విజయమ్మ,షర్మిల, సునీతల మీద పెట్టిన అత్యంత అసభ్యమైన నీచమైన పోస్టుల విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి, మరియు పీఏ రాఘవరెడ్డి పాత్ర ఉందనే సంగతి ఆల్రెడీ బయటకు వచ్చింది. ఆ పోస్టులు పెట్టిన రవీంద్ర రెడ్డే స్వయంగా ఆ సంగతి పోలీసుల విచారణలో వెల్లడించారు. అప్పటినుంచి రాఘవరెడ్డిని విచారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రవీంద్ర రెడ్డి ఒకవైపు రాఘవరెడ్డి పంపిన కంటెంట్ నే తాను పోస్టు చేశానని చెబుతుండగా.. అ విషయాలు తనకేమీ గుర్తులేదని, మర్చిపోయానని రాఘవరెడ్డి పోలీసు విచారణలో వెల్లడిస్తుండడం గమనార్హం.

ఉదయం పదినుంచి రాత్రి పొద్దుపోయే వరకు విచారించిన పోలీసులు ఆయన ఏమాత్రం సహకరించకపోతుండడంతో మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి వైసీపీ సైకోలు అందరూ ఒకటే స్క్రిప్టు మాట్లాడుతుండడం. సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇటీవలి మాటల్లో కూడా.. ప్రభుత్వం కేసులు పెడెుతున్న తమ కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తాం అని ఘనంగా చెప్పుకున్నారు. న్యాయసహాయం అంటే బహుశా.. ‘తెలియదు గుర్తులేదు మర్చిపోయా’ అనే పదాలు చెప్పడం మాత్రమేనేమో అనే సందేహాలు కూడా పలువురిలో కలుగుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories