ప్రస్తుతం మోలీవుడ్ సినిమా భారీ అంచనాలు నడుమ ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫర్ 2 కూడా ఒకటి. అయితే దీనిని ఎల్ 2 ఎంపురాన్ గా పాన్ ఇండియా లెవెల్లో తీసుకొస్తుండగా నెవర్ బిఫోర్ బుకింగ్స్ ఈ చిత్రానికి ఇండియన్ సినిమా దగ్గర కనిపిస్తున్నాయి.
ఒక్క మళయాళ మూవీలోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఈ చిత్రానికి భారీ బుకింగ్స్ ఓపెనింగ్స్ దక్కేలా కనపడుతుంది. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్టుగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ లో చూస్తేనే తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ని రివీల్ చేయడం వైరల్ గా మారింది. ఈ చిత్రానికి కేవలం తెరకెక్కించేందుకే తాము బడ్జెట్ పెట్టినట్టుగా తాను తెలిపాడు.
అంతే కాకుండా ఈ సినిమా కోసం తాను కానీ మోహన్ లాల్ గాని ఎలాంటి రెమ్యునరేషన్ లు తీసుకోలేదని తీసుకోకుండానే తాము చేసినట్టుగా తెలిపారు. రీసెంట్ గా మళయాళ సినిమా దగ్గర స్టార్స్ అంతా రెమ్యునరేషన్ లు పెంచేస్తుండడంతో నిర్మాతలకి లాభాలు కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయి అని అక్కడి ఫిలిం ఫెడరేషన్ వారు తెలిపిన సంగతి తెలిసిందే. దీనితో అదనపు భారం పడకుండా వీరు తీసుకున్న నిర్ణయానికి ఇపుడు చాలామంది ప్రశంసలు అందిస్తున్నారు.