తొలిరోజు ప్రమాణం 9మంది మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వంలో, బుధవారం నాడు  కేవలం 9మంది మంత్రులు మాత్రమే పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంలో చంద్రబాబు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. మంగళవారం ఒక్కరోజులో ఆ కసరత్తు పూర్తి అవుతుందనే గ్యారంటీ కూడా లేదు.

ఈ విషయంలో తొందరపాటు కూడా అనసవరం అని చంద్రబాబు భావిస్తున్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుని, వివిధ వర్గాల అసంతృప్తికి కారణం కావడం కంటె.. ప్రస్తుతానికి బుధవారం నాటి బహిరంగ సభలో 9 మంది మంత్రులతో ప్రమాణాలు చేయించి.. మొదటి అసెంబ్లీ సమాశాల్లోగా మిగిలిన వారిని ప్రమాణం చేయించవచ్చునని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మిత్రపక్షాలైన జనసేన, బిజెపి ఇద్దరికీ కలిపి అయిదు లేదా ఆరు మంత్రి పదవులు మాత్రం ఇవ్వడానికి చంద్రబాబునాయుడు అంగీకరించినట్టు సమాచారం. జనసేన పార్టీ అయిదు మంత్రి పదవులు కోరుతున్నా ఇద్దరికీ కలిపి అయిదారు వరకు వీలవుతుందని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీలకు సీట్లు కేటాయించే విషయంలో అనుసరించిన నీతినే చంద్రబాబు ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. అప్పట్లో జనసేనతో పొత్తులు కుదిరినప్పుడు 30 సీట్లు కేటాయించారు. తర్వాత అదే పొత్తుల్లోకి బిజెపి కూడా ప్రవేశించినప్పటికీ.. ఆ సంఖ్య 30ని పెంచడదానికి మాత్రం మొగ్గు చూపించలేదు. పవన్ కల్యాణ్ తన సీట్లలోనే 10 బిజెపికి త్యాగం చేయడంతో, జనసేనకు ఒక్క సీటు అదనంగా కేటాయించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో 5 అని చెప్పినప్పటికీ, 6 మంత్రి బెర్తులు ఇరుపార్టీలకు కలిపి ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

తమ పార్టీకి 5 కావాలని ఆశపడుతున్న జనసేన, కాస్త తగ్గి 4 స్థానాలకు సంతృప్తి చెందుతోంది. బిజెపికి 2 మంత్రిపదవులు దక్కుతాయి. అయితే తొలిరోజు 12న జరిగే సభలో కేవలం 9 మంది మంత్రులు మాత్రమే ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. తెలుగుదేశం నుంచి 6, జనసేన నుంచి 2, బిజెపి నుంచి 1 గా విభజించారు. సామాజిక కుల సమీకరణలు, ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికగా ప్రాంతీయ సమీకరణలు అన్నీ చెక్ చేసుకుని.. పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని 17వ తేదీలోగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. 17న ఏకాదశినాడు అసెంబ్లీని తొలిసారిగా సమావేశపరచాలని నిర్ణయం. ఆ రోజున ఎమ్మెల్యేలు అందరి ప్రమాణం కూడా ఉంటుంది. అప్పటిలోగా మంత్రులందరూ ప్రమాణాలు పూర్తిచేసి, శాఖల కేటాయింపు కూడా పూర్తిచేయాలని బాబు అనుకుంటున్నారు. పొత్తుల్లో ఎన్నికల టికెట్ల కేటాయింపు స్మూత్ గా జరిగిపోయినట్టే.. మంత్రిపదవుల కేటాయింపు కూడా జరిగిపోవాలని ఆయన కోరుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories