మరోసారి కల్కి వాయిదా!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌… నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ లో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మే 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని వాయిదా వేసేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తుంది.

ఎందుకంటే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను విడుదల చేస్తే ఎన్నికల ప్రభావం సినిమా మీద ఉండనున్నట్లు చిత్ర బృందం భావిస్తోంది. దీంతో మరోసారి చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

అలాగే సినిమాకు సంబంధించిన సీజీ వర్క్‌ కూడా ఇంకా పూర్తి కాలేదని టాక్ వినిపిస్తుంది. అయితే దీని గురించి వైజయంతి మూవీస్‌ ఇంకా ఏ ప్రకటన విడుదల చేయలేదు. కల్కి సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. అశ్విన్‌ దత్ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణెతో పాటు దిశా పటాని కూడా కీలక పాత్రలో నటిస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories