డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా ‘బెగ్గర్’ను విజయ్ సేతుపతితో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపత పాత్రలో మూడు వేర్వేరు కోణాలు ఉండబోతున్నాయి. అంతే కాకుండా ఆయన ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. పూరి ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా విజయ్ సేతుపత లుక్ ను కూడా రూపొందిస్తున్నారు.
ఇంతకుముందు పూరి దర్శకత్వంలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా పెద్ద హిట్ కాకపోవడంతో అతను ఈ సారి మరింత కొత్తదనం, బలమైన కథాంశంతో సినిమా తీయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ కు సరైన పాజిటివ్ రివ్యూలు రాలేదని, పూరి గత సినిమాలకు పోలిస్తే ఈ సినిమాలో కథ తక్కువగా ఉండడం ప్రేక్షకులు, విమర్శకులు గమనించిన విషయం.
ఇప్పుడు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతతో కలిసి ఏ తరహా కథను తెచ్చిపెడతారో చూడాలి. కొత్త ప్రయత్నాలతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావాలు ఉన్నాయి.