మరోసారి వేశ్య పాత్రలో నటించబోతున్న అనుష్క!

వేదం సినిమాలో సరోజ… అంటే టక్కున గుర్తుచ్చేది… ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. అనే పాట. వేదం సినిమాలో డబ్బులు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచార వృత్తిలోకి వచ్చి…ఆ తరువాత అక్కడ నుంచి పారిపోయి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సొంతంగా ఎదగలానుకునే యువతి పాత్రలో అనుష్కను ఎంతో గొప్పగా చూపించాడు డైరెక్టర్ క్రిష్‌.

చేతినిండా సినిమాలు, స్టార్‌ హీరోల పక్కన నటిస్తున్న క్రమంలోనే ఓ స్టార్‌ హీరోయిన్‌ వేశ్యగా నటించింది అంటే అప్పట్లో మామూలు విషయం కాదు. వేదం సినిమాలో అనుష్క నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా దానికి మించిన కాంబో రాబోతుందని సమాచారం. ఈసారి కూడా క్రిష్‌ దర్శకత్వంలోనే అనుష్క మరోసారి వేశ్యగా నటించబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

గతేడాది మిస్‌ శెట్టి..మిస్టర్‌ పోలిశెట్టి సినిమా తరువాత అనుష్క చాలా గ్యాప్‌ తీసుకుంది. ఆ సినిమా తరువాత అనుష్క వరుస సినిమాలను లైన్లో పెట్టింది.ఇప్పటికే మలయాళంలో ఓ సినిమాను ఓకే చేసిన అనుష్క.. తన తరువాత ప్రాజెక్ట్‌ క్రిష్ తో చేయడానికి రెడీ అయ్యింది. ఆ సినిమానే ఘాతీ.

ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో అనుష్క మరోసారి వేశ్యగా కనిపించనుందని సమాచారం. పరిస్థితుల ప్రభావంతో ఓ రొచ్చులో ఇరుకున్న యువతి..తన సాధికారితను చూపించుకోవడానికి ఎలా పోరాడింది అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

సినిమా పేరు ఘాతీ అంటే లోయ అని అర్థం… పైకి రాలేని లోయలో పడిన ఓ యువతి తనను తాను ఎలా కాపాడుకుంది అనేది కథగా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ ని విడుదల చేయగా.. అందులో అనుష్క ముఖాన్ని చూపించలేదు…కానీ చీరను ముఖాన కప్పుకొని ఎడారిలో నడుస్తున్నట్ల చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories