ఎన్నికల పోలింగు పూర్తయిన తర్వాత.. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఫలితాలను అంచనా వేసి చెప్పడం కాదు.. పోలింగుకు రెండు రోజుల ముందే రాష్ట్రస్థాయి పరిస్థితులను మదింపు వేసి.. తెలుగుదేశం కూటమి 161 సీట్లు గెలవబోతున్నదని.. వాస్తవానికి దగ్గరగా ఉన్న అద్భుతమైన జోస్యం చెప్పిన వెబ్సైట్ telugumopo.com మాత్రమే. అసలు ఎన్నికల అంచనాలలోనే ఆ రకంగా తెలుగుమోపో చరిత్ర సృష్టించింది. అదే క్రమంలో.. తెలుగుమోపో అంచనా వేసిన మరో జోస్యం కూడా అచ్చంగా నిజమైంది.
కేంద్ర మంత్రి వర్గం ఆదివారం కొలువు తీరబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగుమోపో రెండు రోజుల ముందే అంచనా వేసింది. తెదేపా ఎన్డీయేలో భాగస్వామి పార్టీనే అయినప్పటికీ.. మంత్రి పదవులు తీసుకుంటుందా? లేదా? అనే ఊహాగానాలు పలువిధాలుగా సాగాయి. అదే సమయంలో.. తెదేపా స్పీకరు పదవి కోసం పట్టుపడుతున్నదని కూడా పలువురు అంచనా వేశారు. కానీ.. రెండు మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుగుమోపో చెప్పింది.
అదొక్కటే కాదు.. ఉత్తరాంధ్రకు చెందిన యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కబోతున్నదని అంచనా వేసింది. జూన్ 6వ తేదీన ‘తెదేపా యువ ఎంపీకి కేంద్రమంత్రి పదవి!’ అనే శీర్షికతో తెలుగుమోపో ఓ కథనం అందించింది. ఇవాళ అదే నిజమైంది. రామ్మోహన్ నాయుడును కేబినెట్ మంత్రి పదవి వరించింది. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి సారి గెలిచిన ఎంపీ అయినప్పటికీ కూడా కేంద్రమంత్రి హోదా దక్కే అవకాశం ఉన్నదని కూడా వెబ్ సైట్ అంచనా వేసింది. అచ్చం అలాగే.. పెమ్మసానికి సహాయమంత్రి పదవి లభించింది.
ప్రస్తుతానికి ఈ రెండు మంత్రి పదవులేనని, త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టినప్పుడు తెలుగుదేశానికి ఇంకా పదవులు దక్కుతాయని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Original Article :