పుష్ప 2 సినిమా మీద ఎంత భారీగా హైప్ ఉందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీని దర్శకుడు సుకుమార్ స్టైల్ లో మాస్, ఎమోషన్ మిక్స్ తో స్టైల్ గా తీసిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఇక ఈ సినిమాలో కనిపించిన కొన్ని ప్రత్యేకమైన సీన్స్, డైలాగ్స్, పాటలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవన్నిలో కిస్సిక్ సాంగ్ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, అల్లు అర్జున్ ఎనర్జీ, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటే, ఈ పాటలో మెరిసిన శ్రీలీల తన డాన్స్ మూమెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా పవర్ ఫుల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట పుష్ప 2 కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్, శ్రీలీల, సుకుమార్ ముగ్గురు ఓ స్పెషల్ సందర్భంలో ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ త్రయం ఇటీవల అమెరికాలో జరిగిన తానా వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ వారు కలిసి దిగిన ఆ ఫోటో అభిమానుల మనసులు దోచుకుంటోంది.
ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్ కంటెంట్ తో పాటు ఈ ముగ్గురు కలిసి కనిపించడం ఒక స్పెషల్ మూమెంట్ గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ ట్రెండింగ్ గా మారింది. ఇదంతా చూస్తే పుష్ప 2 అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది.