ఒక్క రోజులోనే ఓటీటీలోకి..!

ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ల ప్రభావం ఇప్పుడు ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో సినిమా రిలీజ్ డేట్స్‌ కూడా ఈ సంస్థల నిర్ణయాల మీద ఆధారపడుతున్న స్థితి వచ్చింది. సాధారణంగా ఎక్కువ సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం మూడు వారాల నుంచి రెండు నెలల వరకు గ్యాప్‌ ఇచ్చి ఓటిటిలోకి వస్తుంటాయి.

కానీ తాజాగా ఒక సినిమా మాత్రం ఈ రూల్‌కి ఎక్స్‌సెప్షన్ అయింది. తమిళ నటుడు అథర్వ హీరోగా నటించిన తాజా సినిమా “డీఎన్ఏ” దీనికి ఉదాహరణ. ఈ చిత్రం తమిళంలో జూన్ 20న విడుదల కాగా, తెలుగులో “మై బేబీ” పేరుతో రేపు జూలై 18న థియేటర్లలోకి రానుంది.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన కేవలం ఒక్క రోజు తర్వాతే అంటే జూలై 19 నుంచే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వస్తుంది. ఈ డిజిటల్ హక్కులు జియో హాట్‌స్టార్‌ దగ్గర ఉండటంతో అక్కడే స్ట్రీమ్ కాబోతోంది.

ఇంత త్వరగా ఓటిటిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏమనుకున్నారు అనేది స్పష్టంగా తెలియకపోయినా, థియేటర్లలో కలెక్షన్స్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories