పాత పాపాలకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సిందే!

జగనన్న కళ్ళల్లో ఆనందం చూడడానికి హద్దు దాటి అతిగా ప్రవర్తించినందుకు తగిన మూల్యం ఏదో ఒక నాటికి చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు సిఐడి మాజీ చీఫ్ సంజయ్, మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు మీద బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే అనుచితమైన రీతిలో హైదరాబాదు, ఢిల్లీలలో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసినందుకు సంజాయిషీ ఇవ్వాలంటూ హైకోర్టు ఇప్పుడు వారికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజనం వ్యాజ్యం విచారణలో భాగంగా వారికి నోటీసులు పంపడం జరిగింది.

‘జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పరాకాష్ట లాగా చంద్రబాబు నాయుడు మీద బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు నిలుస్తుంది’ అని పలువురు అంటుంటారు. ఆయన పర్యటనలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఆయన బస చేసిన బస్సును చుట్టుముట్టి అరెస్టు చేసిన సిఐడి పోలీసులు చాలా దుర్మార్గమైన రీతిలో రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం దాకా అటు ఇటు తిప్పుతూ విజయవాడ తీసుకువెళ్లి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టా.రు అక్రమంగా బనాయించిన కేసు ఒక ఎత్తైతే దీనికి వ్యతిరేకంగా ప్రజలలో ఆందోళనలు చెలరేగుతూ ఉండగా సిఐడి సంజయ్, మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రెస్మీట్లు కూడా పెట్టారు. ఇలా చేయడం పట్ల అప్పట్లోనే అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సహజంగానే వారు ఖాతరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడం ఒక్కటే తమ జీవిత పరమావధి అనుకున్నారని విమర్శలు విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి.

ఆ తర్వాత సిఐడి జీవితం నుంచి సంజయ్ ను తప్పించడం కూడా జరిగింది. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదనే సామెత చందంగా ఆ పదవి పోయింది, హోదా పోయింది గాని.. అప్పట్లో జగన్ తృప్తి కోసం, జగన్ భక్తితో చేసిన పనుల యొక్క పర్యవసానాలు మాత్రం సిఐడి సంజయ్ ఇప్పటికీ అనుభవించాల్సి వస్తోంది. ప్రెస్ మీట్ లు పెట్టిన వ్యవహారంపై ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అనే సంస్థ అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం వారిద్దరిని ఆదేశించింది. మొత్తానికి ఎప్పుడో చేసిన పాపాలకు వారు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వచ్చేలా ఉందని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories