పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ థియేటర్లలో దుమ్ములేపుతూ భారీ విజయాన్ని సాధించింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత పవన్ మాస్ లుక్‌లో కనబడటంతో ఫ్యాన్స్‌కు నిజమైన పండగలా మారింది.
ఇక తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలతో కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు వార్తల్లోకి వచ్చారు. ఆయన మాట్లాడుతూ తాను తెరకెక్కించిన ‘కబ్జా’ సినిమానే ‘ఓజీ’కి ప్రేరణగా తీసుకున్నారని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
నెటిజన్లు మాత్రం ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘కబ్జా’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని, అలాంటి సినిమాను ఆదర్శంగా తీసుకుని ‘ఓజీ’లా హిట్ చిత్రాన్ని తీయడం అసాధ్యమని కామెంట్లు చేస్తున్నారు.