పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ అంచనాల ప్రాజెక్ట్ ఓజి మీద ఫ్యాన్స్ ఎంత ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్యూర్ గ్యాంగ్‌స్టర్ స్టైల్‌లో తెరకెక్కుతూ, పవన్ అభిమానులకు మాస్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుంది.
ఇప్పుడే ఈ చిత్రానికి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రత్యేకంగా అమెరికా మార్కెట్‌లో పవన్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయ్యింది. రిలీజ్‌కి ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉండగానే ప్రీమియర్ షో ప్రీ-సేల్స్‌తోనే నార్త్ అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటింది. ఈ ఫిగర్ చూస్తుంటే థియేటర్ల వద్ద బాక్సాఫీస్ రికార్డులు కొత్తగా రాసుకుపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.