ఈ మార్చ్ లోనే మన తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు పలు చిత్రాలు రీరిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో ఈ శుక్రవారం కూడా రెండు సినిమాలు విడుదలకు వచ్చాయి. మరి ఈ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ సినిమా సలార్ కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా వచ్చిన ఈ సినిమా మేనియా ఓ రేంజ్ లో కనిపిస్తుండగా ఇపుడు సలార్ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా చేయడం వైరల్ గా మారింది.
పలు చోట్ల పవన్ నటిస్తున్న అవైటెడ్ సినిమా “ఓజి” తాలూకా గ్లింప్స్ ని మధ్యలో ప్లే చేయగా దానికి డార్లింగ్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇలా తమ హీరో రీరిలీజ్ లో పవన్ గ్లింప్స్ ని కూడా ఈ రేంజ్ లో ఎంజాయ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ విజువల్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సహా ప్రభాస్ అభిమానులు ఈ వీడియోలు చూసి తెగ సంబరపడిపోతున్నారు.