పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “ఓజి” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందించబడింది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు తెరపై కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
షూటింగ్ చివరి రోజు సందర్భంగా తీసిన ఓ గ్రూప్ ఫోటోను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు సుజిత్, నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ మరియు యూనిట్ సభ్యులు కలిసి ఉన్నారు. ఆ క్లిక్ ప్రస్తుతం అభిమానుల మధ్య వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్టు టీమ్ ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.