కొన్ని సందర్భాల్లో అసలు ఆడవు అనుకున్న సినిమాలు సూపర్ హిట్ కొడుతుంటాయి. కానీ అసలు ఆ సినిమాని మరో హీరో వద్దు అనుకుంటాడు. అది హిట్టయిన తరువాత కానీ ఆ విషయం మనకి తెలియదు. ఇలా ఎన్నో సందర్భాల్లో మనం చూశాం. పవన్ కల్యాణ్ కోసం రెడీ చేసిన ఇడియట్ సినిమాని రవితేజ చేసి…సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు.
భద్ర సినిమా తారక్ కోసం…సింహాద్రి బాలయ్య కోసం ఇలా బ్లాక్ బస్టర్ హిట్లు వదులుకున్న హీరోలు ఎందరో. ఈ క్రమంలోనే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మూవీ ‘దేశముదురు’ . ఈ సినిమాలో హన్సిక కథానాయకగా నటించింది. ఈ సినిమా అప్పట్లో ఓ సూపర్ హిట్. సినిమాకి తగ్గట్లే చక్రి పాటలు ఓ రేంజ్ హిట్. టాలీవుడ్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ పరిచయం అయింది కూడా ఈ సినిమాతోనే. కానీ ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో అల్లు అర్జున్ కాదంట.
ఈ సినిమా కథను అక్కినేని సుమంత్ కోసం రెడీ చేశారట. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ఇద్దరు కలిసి వెళ్లి సుమంత్ కు కథ చెప్పారంట. కానీ ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర ఒక సన్యాసిని. సన్యాసిని లవ్ చేయడం అదంత కరెక్ట్ కాదని అనిపించి సుమంత్ ఈ సినిమాను వద్దు అని చెప్పారంట. ఈ విషయం స్వయంగా సుమంత్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆలా అయిపోయిందని సుమంత్ అన్నాడు.