దేవుడా..ఓ దేవుడా సీన్ రీ క్రియేట్ చేసిన వెంకీ మామ! టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో అంటే అది కచ్చితంగా వెంకీ మామ గా పిలవబడే విక్టరీ వెంకటేషే. అయితే తన ఎమోషనల్ పెర్ఫామెన్స్ లకి కానీ లేదా కామెడీ టైమింగ్ కి కానీ పిచ్చ అభిమానులున్నారు.
అలా తాను చేసిన ఎన్నో చిత్రాల్లో ఒక కల్ట్ క్లాసిక్ హిట్ మూవీ అంటే “నువ్వు నాకు నచ్చావ్” అయితే ఇప్పటికీ జనం ఎన్నిసార్లు చూస్తారో తెలియదు. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెంకీ మామపై ఒక ఐకానిక్ కామెడీ సీన్ ఉంటుంది. మరి ఈ ఎవర్ గ్రీన్ కామెడీ సీన్ ని బాలయ్య షోలో వెంకీ మామ లేటెస్ట్ గా దానిని రీక్రియెట్ చేశారు.
భోజనం కోసం ప్రార్థన చేసే కామెడీ సీన్ ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ ఆ సీన్ ని బాలయ్య ముందు అదే కామెడీ టైమింగ్ తో చేయడంతో ఈ సీన్ అండ్ హ్యాపీ మూమెంట్స్ ఇపుడు అభిమానుల్లో వైరల్ గా మారాయి. మరి ఈ ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి హైలైట్స్ ఉన్నాయో తెలియాలి అంటే ఆహా లో చూడాల్సిందే.