సాహోకి..ఓజీకి లింక్‌ ఉందా..అంటే!

ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామా కలిపి తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి షో కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి ఈ మూవీ ఆటల రూపంలో మొదలుకానుంది.

ఇక మొదటి నుంచి ఈ సినిమా గురించి ఒక ప్రత్యేకమైన రూమర్ వినిపిస్తూ వస్తోంది. సుజీత్ గత చిత్రం “సాహో” తో ఓజికి సంబంధం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. షూటింగ్ సెట్స్ లో “వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్” అనే బోర్డ్స్ కనిపించడం కూడా ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. అందుకే ఇరువురు సినిమాలు ఒకే యూనివర్స్‌లో భాగమా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.

తాజాగా మళ్ళీ ఇదే బజ్ పెద్దగా చర్చకు వచ్చింది. కానీ ఇందులో ప్రభాస్ పాత్రగా ఎలాంటి స్పెషల్ క్యామియో లేదని తెలిసింది. అయితే సుజీత్ తన స్టైల్లో “సాహో”–“ఓజి” లకు మధ్య కనెక్షన్ చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories