పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజి ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా, థమన్ సంగీతం సమకూర్చాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే పవన్ కెరీర్ లోనే అత్యంత పెద్ద ఓపెనింగ్ సాధించింది.
థియేటర్ల దగ్గర ఏర్పడిన హంగామా, అభిమానుల రెస్పాన్స్ చూసి సినిమా ఎంత స్థాయిలో హిట్ అయిందో అర్థమవుతోంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా అసాధారణ వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం అక్కడ ఓజి సుమారు ఇరవై నాలుగు కోట్ల షేర్ ను సంపాదించింది. ఈ ఫలితంతో కేవలం ఒకటి రెండు రోజులలోనే పవన్ తన గత రికార్డులను అధిగమించే స్థాయిలో దూసుకెళ్లాడని చెప్పవచ్చు.