మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సుజీత్‌!

ప్రస్తుతం టాలీవుడ్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాతో మునిగిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పీక్‌కి చేరింది. ఈ క్రమంలో దర్శకుడు సుజీత్ ఫ్యాన్స్‌కి కొత్తగా అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వన్స్‌మోర్ అనే ఆన్‌లైన్ గేమ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో కొన్ని స్టెప్పులు పూర్తయ్యాక ఫైర్‌స్టోర్మ్ అనే ప్రత్యేక ఫీచర్ అన్‌లాక్ అవుతుందని ముందే సూచించారు. తాజాగా లక్ష మందికి పైగా అభిమానులు ఈ గేమ్‌ను ఆస్వాదించడంతో ఆ సర్‌ప్రైజ్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే, ఓజీ కథ ఆధారంగా ఒక ప్రత్యేక కామిక్ బుక్‌ను కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీనితో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉందని సుజీత్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories