టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఓదెల 2’ కూడా ఒకటి. దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తున్న ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది ఈ సినిమా. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన థీయేట్రికల్ డీల్ క్లోజ్ అయినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాకు థియేట్రికల్ డీల్‌లో సాలిడ్ రేట్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ థియేట్రికల్ డీల్ రూ.10 కోట్లకు క్లోజ్ అయ్యిందట. అటు నాన్-థియేట్రికల్ డీల్ రూ.18 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.
ఇలా భారీ మొత్తంలో ఓదెల 2 మూవీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్ క్లోజ్ చేయడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.