ఆ ఓటీటీలోకి ఓదెల 2!

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల విడుదలైన చిత్రాల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన “ఓదెల 2” కూడా ఒకటి. ఈ చిత్రం దర్శకుడు అశోక్ తేజ దర్సకత్వంలో తెరకెక్కింది. చిత్రానికి సంపత్ నంది కథ, నిర్మాణం అందించారు. ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కంటే ముందే ఓటీటీ వేదికపై మంచి డీల్ కుదిర్చుకుంది.

“ఓదెల 2” చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది. ఇక, ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సినిమా థియేటర్స్ లో విడుదలైన కొద్ది రోజుల్లోనే, కేవలం 3 వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం కావడం ఒక ప్రత్యేకత. మీరు ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూడకపోతే, ఆపై ప్రైమ్ వీడియోలో చూసుకోవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories