తెలుగు సినిమా అభిమానుల్లో ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి స్టార్ హీరో ఇప్పుడు బాలీవుడ్ రంగంలో అడుగుపెడుతూ ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఆయన కీలక పాత్రలో కనిపించే తాజా చిత్రం “వార్ 2” అనే బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, మన ఎన్టీఆర్ పాత్ర విషయంలోనూ భారీగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పుడే ఏర్పడిన హైప్ లో ఎన్టీఆర్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఆయన క్రేజ్ సినిమాకి మరింత బలాన్ని ఇస్తోంది.
ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చూస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి విదేశీ మార్కెట్లలో కూడా ఈ సినిమాకి మాస్ లెవల్లో ఓపెనింగ్స్ రావొచ్చని అంచనాలు ఉన్నాయి. ఆ క్రేజ్ కి ప్రధాన కారణం ఎన్టీఆర్ అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకుల మద్దతుతో పాటు హిందీ ఆడియెన్స్ లోనూ ఆయనకి క్రేజ్ పెరుగుతుండటంతో సినిమా వ్యాపారం పట్ల డిస్ట్రిబ్యూటర్లలో భారీ నమ్మకం ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో “వార్ 2” సినిమాకి దక్షిణాది ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే, ఇది మరో పాన్ ఇండియా హిట్ అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలంటే, ఈ యాక్షన్ మూవీకి ఎన్టీఆర్ బ్రాండ్ చాలా మద్ధతు ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.