మళ్లీ ఎన్టీఆర్‌ ని అలా చూస్తారు!

నందమూరి అభిమానులతో పాటు , యావత్‌ తెలుగు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్‌ ఇండియా సినిమాల్లో దేవర మూవీ ఒకటి. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ క్యూట్ లుక్స్ లో కనిపించి అలరించారు. దేవర చిత్రంలో ఎన్టీఆర్ మళ్ళీ అదే తరహాలో కనిపించనున్నట్లు ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఓ హింట్‌ ఇచ్చారు. అన్న ఎన్టీఆర్ ను ఇలా క్యూట్ గా చూసి 6 ఏళ్లు అయ్యింది కదా, మళ్ళీ ఆ క్యూట్ స్మైల్ చేస్తూ రొమాన్స్ చేయడం అభిమానులు మరోసారి చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. మనకి అదే సరిపోతుంది కదా అంటూ వివరించారు.

అంతేకాక అరవింద సమేత చిత్రంలోని రెండు ఫోటోలను నాగవంశీ షేర్ చేశారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories