ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ మొదలయ్యేది అక్కడేనంట!

ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ మొదలయ్యేది అక్కడేనంట! మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ రీసెంట్‌గా దేవర మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తారక్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘వార్-2’లో నటిస్తున్నాడు.

 ఈ సినిమా తర్వాత, ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తారక్ లాంటి పవర్‌హౌజ్‌తో ప్రశాంత్ నీల్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని.. ఫిబ్రవరి 17 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. 

ఈ షూటింగ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారట. వికారాబాద్ అడవులు, పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ మార్చి నెలలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories