‘వార్ 2’ షోస్ కి అప్పుడే భారీ డిమాండ్!

తెలుగు ప్రేక్షకుల్లో ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ కూడా అంతే భారీ. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తుండటం సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచేస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరే “వార్ 2”.

ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిందనగానే నేషనల్ లెవెల్‌లో ఆసక్తి మొదలైపోయింది. కానీ తెలుగులో మాత్రం ఇది మరింత విపరీతంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడంటే చాలు, తెలుగు అభిమానులు ఇప్పుడు నుంచే ప్రత్యేక షోల గురించి ఆలోచనలు మొదలుపెట్టేసారు. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు స్థానిక థియేటర్ల యాజమాన్యాలతో స్పెషల్ షోలు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

ఇంత వారం ముందు నుంచే ప్రేక్షకుల్లో సినిమాపై ఈ స్థాయి హైప్ ఉండటం అంటే తారక్ మాస్ మార్కెట్ ఎంతగా పెరిగిందో చెప్పకనే చెప్పింది. ఇక హృతిక్ రోషన్ పక్కన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ప్రీతమ్ అందిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ మూవీ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

ఈ మూవీతో బాలీవుడ్ మార్కెట్‌లో ఎన్టీఆర్ మరో లెవెల్‌కి వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక యాక్షన్ ఎలిమెంట్స్, స్టార్ పవర్, టెక్నికల్ హై స్టాండర్డ్స్ అన్నీ కలిపి ఈ సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories