వాళ్లు కాదు..సామ్‌ నే బెస్ట్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”. ఇపుడు ఈ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉండగా చరణ్ కూడా పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మరి ఇలా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో నట సింహం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాప్పబుల్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

 ఇందులో చాలా ఆసక్తికర ప్రశ్నలకి చరణ్ సమాధానం చెప్పాడు. ఇలా చరణ్ బెస్ట్ నటి ఎవరు అనే ప్రస్తావనలో కియారా అద్వానీ, ఆలియా భట్ అలాగే సమంతల పేర్లు చెబితే వారిలో బెస్ట్ నటిగా సమంతని మాత్రమే గ్లోబల్ స్టార్ పిక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories