ముందు సూర్య కాదు!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పూర్తి యాక్షన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమా తొలి హీరో సూర్య కాదట. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్వయంగా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశాడు. తొలుత రెట్రో కథను తాను సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం రెడీ చేసుకున్నాడంట.. అది పూర్తి యాక్షన్ జోన్ కథ అని కూడా వివరించాడు. అయితే, సూర్యకు కథను నెరేట్ చేసిన తర్వాత దానిని లవ్ స్టోరీగా మార్చానని ఆయన చెప్పుకొచ్చాడు.

రజినీ కోసం కథను రాసుకోవడంతో ఆయనకు వినిపించావా అని సూర్య కూడా తనను అడిగినట్లు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపాడు. ఇక ఈ సినిమలో సూర్య అదిరిపోయే లుక్స్‌తో కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories