పెళ్లి కాలేదు.. జస్ట్ … అంటూ క్లారిటీ ఇచ్చిన భామ!

టాలీవుడ్‌ నటుడు సిద్దార్థ్‌, నటి అదితిరావు నిన్నటి నుంచి వార్తల్లో ఉన్నారు. ఎందుకంటే వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వనపర్తి శ్రీరంగనాథాలయంలో పెళ్లి చేసుకున్నారనే వార్త వినిపించింది.

అయితే ఈ వార్తలకు హీరోయిన్‌ అదితి రావు చెక్‌ పెట్టింది. వీటికి చెక్‌ పెడుతూ పెళ్లి కాలేదని జస్ట్‌ ఎంగేజ్మెంట్‌ చేసుకున్నట్లు తెలుపుతూ ఇద్దరిది ఓ ఫోటో పెట్టింది.తనకి సిద్దార్థ్‌ ఎస్‌ చెప్పాడు అన్నట్లుగా అదితి అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఎప్పటి నుంచో వస్తున్నా వార్తలకి ముగింపు పలికిందని చెప్పవచ్చు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వారి నూతన జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారిద్దరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories