నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ది మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ మూవీ ‘హిట్-3’ని రిలీజ్‌కు రెడీ చేశాడు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నాని ఓ రగడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
అయితే, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్‌గా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వీడియోను మార్చి 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ గ్లింప్స్ వీడియో కేవలం పాన్ ఇండియాగా నేషనల్ వైడ్ కాకుండా.. ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ ట్రీట్ అదిరిపోయే విందును అందించనుంది.
‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీంతో ఈ చిత్రం కేవలం నేషనల్ స్థాయిలో కాకుండా, ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.