రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్య జిమ్‌లో వర్క్‌వుట్ చేస్తోన్న సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఐతే, 6 నెలలు గడిచినప్పటికీ ఆ గాయం నుంచి ఇంకా తాను పూర్తిగా కోలుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. పైగా ఆ గాయం తనకు ఎన్నో విషయాలు నేర్పింది అంటూ ఈ బ్యూటీ చెబుతుంది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న రకుల్ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ‘జిమ్‌లో గాయం నాకో ఎదురుదెబ్బ. ఇప్పటికీ సరైన స్థితిలోకి రాలేదు. అప్పటికంటే కాస్త మెరుగు అయినప్పటికీ నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని రకుల్ తెలిపింది.
రకుల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేటికీ నేను చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నాను. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయని అనుకున్నా ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. నిజానికి గాయాన్ని నేను మొదట నిర్లక్ష్యం చేశాను. చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకునే సమయానికే దాని తీవ్రత ఎక్కువైంది. గాయం నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుందని వారం రోజులకు అర్థమైంది. ధైర్యంగా దాన్ని నుంచి కోలుకుంటున్నాను’ అని రకుల్ చెప్పుకొచ్చింది.