అక్కినేని కంపౌండ్‌ నుంచి కాదు మెగా కంపౌండ్‌ నుంచి..!

టాలీవుడ్ సీనియర్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని నాగార్జునలు నడుమ స్నేహ బంధం ఏపాటిదో అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గానే అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య అలాగే శోభితల నుంచి ఒక గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఇద్దరు యువ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా టాక్ వినిపించింది.

అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అన్నట్టే తర్వాత కన్ఫర్మ్ అయ్యింది. కానీ అక్కినేని ఇంట నుంచి ఏమో కానీ మెగా ఇంటి నుంచి ఓ శుభవార్త  వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని టాక్ వినిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి కొణిదెలలు తల్లిదండ్రులు కానున్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తోంది. దీనితో మెగా కుటుంబం నుంచి గుడ్ న్యూస్ త్వరలోనే అధికారికంగా ప్రకటన రావచ్చని టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories