టిల్లు స్క్వేర్ విజయంతో నాకు మాటలు రావడం లేదని అనుపమ పరమేశ్వరన్ అంది. డీజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయగా మంచి టాక్ ను అందుకుంది.ఈ సినిమా థియేటర్లలో మంచి హిట్ ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. సంచలన వసూళ్ల ను రాబట్టింది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ డైరెక్షన్ వహించారు. సినిమా భారీ విజయాన్ని సాధించడంతో మూవీ మేకర్స్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ.. ‘ఆనందంలో నాకు మాటలు కూడా రావడం లేదు. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచపోను. ఈ చిత్రం చేస్తున్నప్పుడు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి వచ్చిన స్పందన చూస్తుంటే మాటలు రావడం లేదు. నా క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. నేను మొదటిసారి ఇలాంటి క్యారెక్టర్ చేశాను. నేను చేసిన లిల్లీ పాత్రకు మంచి పేరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.