నో వెకేషన్..నో రెస్ట్‌..ఓన్లీ షూటింగ్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ , కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తరువాత ఎన్టీఆర్‌ నుంచి వస్తున్న చిత్రం తో పాటు కొరటాల కాంబోలో రావడంతో అభిమానులు అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంది.

అయితే వేసవి కాలం వచ్చిందంటే హీరోలంతా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెకేస్తుంటారు. కానీ ఈసారి యంగ్‌ టైగర్‌ మాత్రం రెస్ట్‌ తీసుకోవడం లేదు. ఈ సారి ఎన్టీఆర్‌ ఎలాంటి వెకేషన్‌ ప్లాన్‌ వేసుకోలేదు. రెస్ట్‌ కూడా తీసుకోవడం లేదు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసేందుకు చిత్ర బృందంతో పాటు ఎన్టీఆర్‌ కూడా భావిస్తున్నాడు.

హైదరాబాద్‌ లోనే ప్రస్తుతం కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ దాదాపుగా పూర్తయ్యింది. ఎన్టీఆర్‌, జాన్వీల పై ఓ పాటని , కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి చిత్ర బృందం గోవా వెళ్తుంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం తొలి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories