మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి- తాను పరామర్శలకు వెళ్లడం అనేది ప్రయారిటీ విషయం కానే కాదు. ఆ ముసుగులో తన ఆర్భాటం చూపించుకోవాలని, తాను పోగేసిన వేల సంఖ్యలోని కిరాయి మనుషులను తన అభిమానులుగా ప్రదర్శించుకోవాలని మాత్రమే ఆయనకు తాపత్రయం. వారితో జేజేలు కొట్టించుకోవాలని, సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకోవాలని ఆయనకు కోరిక. అంతే తప్ప మరొక శ్రద్ధ ఉండదు. ఇందుకు స్పష్టమైన నిదర్శనం నెల్లూరు యాత్రలోనే కనిపిస్తూ స్తూ ఉంది.
ఎందుకంటే.. నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ లో కలిసి పరామర్శించాలని జగన్ మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇందుకు సంబంధించి ఈ పోలీసులను అనుమతులు అడిగారు. చెముడుగుంట వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతించారు. అయితే అక్కడ హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయని, అప్రోచ్ రోడ్ సరిగ్గా లేదని, జగన్ కు ప్రమాదం అని రకరకాల సాకులు చెప్పి ఆ స్థలం వద్దని పార్టీ వారు తిరస్కరించారు. ఒక విద్యాసంస్థ మైదానాన్ని ఇవ్వాలని వారు కోరారు గానీ, అందుకు పోలీసులు అనుమతించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి దళాలు చెముడుగుంట స్థలం వద్దనడం వెనుక అసలు రహస్యం వేరే ఉంది. కాకాణి గోవర్ధనరెడ్డి ఉన్న నెల్లూరు సెంట్రల్ జైలుకు ఆ హెలీపాడ్ స్థలం సమీపంలోనే ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా జైలుకు వెళ్లి సునాయాసంగా తిరిగి, తెలిపాడ్‌కు వచ్చి వెళ్ళిపోవచ్చు! అంత సింపుల్ గా తన పర్యటన ముగిసిపోవడం జగన్ కు ఇష్టం లేదు. అలా చేస్తే నగరం మధ్యలో జనాన్ని ప్రదర్శించుకుంటూ ఊరేగడం కుదరదు. కేవలం అందుకోసమే జగన్ అప్పట్లో తన పర్యటన రద్దు చేసుకున్నారు.
తీరా ఇప్పుడు కూడా అనుమతులు అడిగితే పోలీసులు అదే చెముడుగుంట స్థలాన్ని హెలిప్యాడ్ కోసం కేటాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అంగీకరించారు. ఎందుకంటే ప్రశాంతి రెడ్డిని బూతులు తిట్టిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటికి వెళ్లి పరామర్శించాలని కొత్తగా తన కార్యక్రమంలో జత చేసుకున్నారు.
కాకాణి ఉన్న జైలు నుంచి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. నగరంలో తన కాన్వాయ్‌తో ఊరేగుతూ.. వేల మంది జనాన్ని పోగేసి జనజీవితాల్ని చిద్రం చేస్తూ వెళ్లాలని జగన్ మోహన్ న్ రెడ్డి కోరిక నెరవేరుతుంది. అందుకే , అప్పట్లో ఇచ్చిన స్థలంలోనే ఇప్పుడు కూడా అనుమతి ఇచ్చినప్పటికీ జగన్ ఒప్పుకున్నారు. అయితే జగన్ తన కాన్వాయ్‌తో జన సమీకరణ చేసి వెళ్లడం వలన నెల్లూరు నగరంలో సాధారణ పౌరులకు తీవ్రమైన ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయన ప్రయాణించే మార్గంలో ఉన్న రాజరాజేశ్వరి ఆలయం మహా కుంభాభిషేకం ఇవాళ 11:30 గంటలకు జరగబోతుంది. అదే మార్గంలోని నెల్లూరు జనరల్ హాస్పిటల్ కూడా ఉంటుంది. అక్కడ మామూలుగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. జగన్ తన మందీమార్బలంతో, పోగేసిన జనాలతో కలిసి అక్కడ ట్రాఫిక్ ను స్తంభింపజేస్తే అనేక మంది పేద రోగులకు ఇబ్బందులు తప్పవు. కనీసం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో అయినా జగన్మోహన్ రెడ్డి దళాలు తమ ఓవరాక్షన్ తగ్గించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.